ప్రముఖ నటుడు వెంకటేష్ ముంబై చేరుకున్నారు. సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో అందాల తార శ్రీదేవి పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీదేవితో కలిసి నటించిన క్షణక్షణం సినిమా నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. అద్భుత నటి అనీ, ఎటువంటి భావాన్నైనా కళ్లతో పలికించగలరని చెప్పారు. ఆమె మృతి భారత చలన చిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa