ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు ప్రజలకు గవర్నర్ హోలీ శుభాకాంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 12:47 PM

హైదరాబాద్ : హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ హోలీ ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలకు దోహదపడుతుందన్నారు. జాతీయ సమగ్రతను హోలీ పండుగ పెంపొందిస్తుందని పేర్కొన్నారు. సాంఘిక అంతరాలు తొలగించి బంధాల బలోపేతానికి దోహదపడుతుందని గవర్నర్ తెలిపారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా హోలీ నిలుస్తుందన్నారు.a










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa