ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య వివాదం కోర్టుల్లో తేలేది కాదు: పండిట్ రవిశంకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 11:24 AM

అయోధ్య వివాదం న్యాయస్ధానాల్లో తేలేది కాదని ప్రముఖ ఆథ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్ధాపకులు పండిట్ రవిశంకర్‌ అన్నారు. అయోధ్య వివాదానికి దూరంగా ఉండాలని రవిశంకర్ ను బాబ్రీ యాక్షన్ కమిటీ కోరిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ముస్లింలు పెద్దగా వ్యతిరేకించడం లేదని అన్నారు. అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకుంటే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో కోర్టులో కేసును ఓడిపోయిన వారు తొలుత తీర్పును అంగీకరించినా, భవిష్యత్‌ లో దీనిపై గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రవిశంకర్ సూచనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసులో తుది విచారణను గత డిసెంబర్‌ 5న సుప్రీం కోర్టు పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa