రంగారెడ్డి: వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ నేడు ప్రారంభమైంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, ఎంపీలు కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa