ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం గైగొళ్లపల్లిలో రెండు పడక గదుల ఇళ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్త రామదాసు పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులు నింపుతామని తెలిపారు. ఉగాది నాటికి ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పారు. మార్చిలో రైతులందరికీ పట్టాదారు పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa