ముంబయి: భారత్‌లో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఫండ్స్ లెండింగ్ రేట్స్(ఎంసీఎల్‌ఆర్)ను 7.95 శాతం నుంచి 8.15 శాతానికి పెంచుతున్నట్లు ఎస్‌బీఐ గురువారం వెల్లడించింది. ప్రస్తుతం రుణాలపై వడ్డీరేటును ఎంసీఎల్‌ఆర్ ఆధారంగా నిర్ణయిస్తున్నారు. కొత్త రుణ రేటు వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఒక సంవత్సంరం ఎంసీఎల్‌ఆర్ లేదా బెంచ్‌మార్క్ రేట్లను పెంచడం 2016 ఏప్రిల్ తరువాత ఇదే తొలిసారి. బల్క్(రూ.కోటి నుంచి రూ.10కోట్ల వరకు) టర్మ్ డిపాజిట్లపై వడ్డీని కాలపరిమితిని బట్టి 0.75 శాతం వరకు పెంచిన మరుసటి రోజే ఎస్‌బీఐ రుణరేటును సవరించింది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన రేట్లు 2018, మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. రుణ రేటును 8.15శాతం నుంచి 8.30శాతం వరకు పెంచింది. ఇప్పటికే చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ డిపాజిట్, రుణ రేట్లను సవరించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa