ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర పిటిషన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 12:25 PM

హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలం సరిహద్దులోని తడపలగుట్ట-పుజారికాంకేడు అటవీప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై పౌరహక్కుల సంఘం హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేసింది. మృతదేహాలను సరైన పద్దతిలో భద్రపరిచేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో శవపరీక్షలు నిర్వహించాలని కోరింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలంది. పౌరహక్కుల సంఘం పిటిషన్‌ను హైకోర్టు ఈ మధ్యాహ్నం విచారణకు చేపట్టనున్నట్లు సమాచారం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa