ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 12:35 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. కేసీఆర్ ఒక దద్దమ్మంటూ ధ్వజమెత్తారు. రీసెంట్ గా ఒక రైతు సభలో మట్లాడిన కేసీఆర్, రాష్ట్రంలో వ్యవసాయానికి కనీసం రూ.10 వేల కోట్లు కూడా కేటాయించని దద్మమ్మలు కేంద్రప్రభుత్వంలో అధికారంలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాతా కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు దత్తాత్రేయ.


“దేశంలో రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తో పోలుస్తావా..రాష్ట్రం నుంచి మంత్రులెవరైనా ఢిల్లీ వెళ్తే..కేంద్రమంత్రులు వేల కోట్ల రూపాయల్ని కేటాయిస్తున్నారు. ప్రధానిగా మోడీ వచ్చాకే దేశంలో రైతులు పచ్చగా, సంతోషంగా ఉన్నారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం బీజేపీ సర్కారే. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పరిస్థితి ఎలా ఉందో దద్దమ్మ కేసీఆర్ ఒక్కసారి తెలుసుకోవాలి” అంటూ కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు బండారు దత్తాత్రేయ.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa