హైదరాబాద్ :తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశాడని టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. నేడిక్కడ మోత్కుపల్లి విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వల్లే చంద్రబాబుకు మచ్చ వచ్చిందని చెప్పారు. పార్టీకి నాయకత్వం వహించిన వాళ్లే పార్టీని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. ఆనాడే రేవంత్‌ను సస్పెండ్ చేసి ఉంటే పార్టీ బ్రతికేదని ఆయన చెప్పారు. సరైన నాయకత్వం లేకే తెలంగాణలో టిడిపి భ్రష్టు పట్టిందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబునాయుడుకు తాను అండగా నిలబడ్డానని అన్నారు. ఉద్యమ సమయంలో తనను హత్య చేయడానికి రెక్కీ కూడా జరిగిందని ఆయన చెప్పారు. తన జీవితాన్ని పణంగా పెట్టి చంద్రబాబుకు సహకరించానని ఆయన అన్నారు. పార్టీ తనకు ఏ పదవి ఇవ్వకపోయినా విధేయంగా పని చేశానని చెప్పారు. ఎన్టీఆర్ వద్ద పని చేసినట్లుగానే చంద్రబాబు వద్ద కూడా పని చేశానని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa