ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఆయనకు చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ అమెరికాలోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దీనికి సంబంధించిన విచారణను న్యాయస్థానం చేపట్టింది. రుణదాతలు నీరవ్ దగ్గర నుంచి రుణాలను ఇప్పుడే వసూలు చేయొద్దని.. అతడి మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు పేజీల నివేదికను విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం నీరవ్‌కు రుణాలు ఇచ్చిన రుణదాతలు ఆయన దగ్గర నుంచి డబ్బులు తిరిగి తీసుకోవడం కుదరదు. ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటివి చేయకూడదు. నీరవ్‌పై రుణదాతలు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే పిటిషన్లు దాఖలు చేయకూడదు. రుణం చెల్లించాల్సిందిగా రుణగ్రహీతకు ఫోన్, మెయిల్ చేసి డిమాండ్ చేయకూడదు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఎవరైనా నీరవ్ ఫైర్‌స్టార్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. రుణదాతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. దీనికి సంబంధించిన నివేదికను నీరవ్‌కు రుణాలు ఇచ్చిన స్టాక్ హోల్డర్స్‌కు పంపించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.12వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ ఈనెల 26న అమెరికాలోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. పునర్వ్యవస్థీకరణకు వీలు కల్పించే ఛాప్టర్11(అమెరికా) నిబంధనల ప్రకారం ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ దీన్ని నమోదు చేసింది. వ్యాపారాన్ని సజీవంగా నిలుపుకోవడంతో పాటు రుణదాతలకు అప్పులు తిరిగి చెల్లించే వెసులుబాటు కోసం ఓ ప్రణాళికను ప్రతిపాదిస్తూ ఈ తరహా పిటిషన్‌ను దాఖలు చేస్తారు. మరోవైపు ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు అమెరికాలో పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa