ఫాల్గుణమాసం.. ఆదివారం.. కృష్ణపక్షం, తదియ.. ఇవన్నీ ఒకేరోజు కలిసొస్తే.. అంతకంటే మంచి ముహుర్తం ఉండదు. మార్చి 4వ తేదీన ఈ శుభఘడియలన్నీ కలిసిరావడంతో శుభకార్యాలకు.. ముఖ్యంగా వేల వివాహాలకు మార్చి 4వ తేదీ వేదికైంది. ఈ ఒక్కరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది జంటలు ఒక్కటి కాబోతున్నాయి. హైదరాబాద్ నగరంలోనే ఆదివారం ఒక్కరోజే 50వేలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నట్లు తెలిసింది. దీంతో కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు హౌస్‌ఫుల్ అయిపోయాయి. పెళ్లిళ్లకు తరలివచ్చే వారితో బస్సులు, రైళ్లలో రద్దీ కూడా పెరిగింది.
గడిచిన మూడు నెలలుగా ముహుర్తాలు లేకపోవడం, శ్రావణం మాసంలో రెండు మూడు ముహుర్తాల కంటే ఎక్కువగా లేకపోవడంతో పెళ్లి తంతు ఈలోపే జరిపించేయాలని భావించడమే ఇంత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడానికి కారణంగా తెలుస్తోంది. పైగా ఆదివారం రోజున ముహుర్తం అన్ని రాశులు, నక్షత్రాల వారికి కలిసొస్తుందని, లగ్న బలం బాగుందని పురోహితులు చెబుతున్నారు. ఈ ఒక్కరోజే 20వరకూ శుభఘడియలు ఉన్నాయట. ఆదివారం(మార్చి4) మాత్రమే కాదు సోమవారం కూడా మంచిరోజేనట. సోమవారం కూడా హైదరాబాద్ నగరంలో మరో 30వేల వివాహాలు జరగనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, ఈ రేంజ్‌లో పెళ్లిళ్లు ఉండటంతో షామియానా నిర్వాహకులు, ట్రావెల్స్ కంపెనీల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa