భద్రాచలం ఏజెన్సీలోని చర్ల-వెంకటాపురం మండలాల సరిహద్దులోగల కోడిపుంజుల గుట్ట వద్ద శనివారం ఉదయం మావోయిస్టులకు, పోలీసుల మధ్య మళ్లీ కాల్పులు జరిగాయి. నిన్న ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో పెద్దపెద్ద గుట్టలున్నాయి. అయితే... ఆ ఎన్‌కౌంటర్ అనంతరం కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వీరు ఆ గుట్టల్లో ఉన్నారన్న అనుమానంతో పోలీస్ బలగాలు ఆ గుట్టలను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాగా... ప్రస్తుతం గుట్టలున్న ప్రాంతానికి అటు చత్తీస్‌ఘడ్ పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. దీంతో ఏజెన్సీలో యుద్ధ వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa