నిజామాబాద్: రెండు లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ కిరాణ దుకాణంపై టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడి చేశారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో గుట్కా అక్రమ నిల్వలను గుర్తించారు. గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు షాపు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa