ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానానికి తప్పిన ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 04, 2018, 03:48 PM

రంగారెడ్డి: శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో విమానానికి పెను ప్రమాదం తప్పింది. సిటీ లింక్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం జెడ్డా నుంచి ఇండోనేషియా కు బయలుదేరింది. అయితే మార్గ మధ్యలోనే ఇంధనం నిండుకోవడంతో పైలట్ అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న సిబ్బంది సిటీ లింక్ విమానంలో ఇంధనం నింపారు. టేకాఫ్ అయే సమయంలో ఇంధనం లీకవుతున్నట్లు గుర్తించిన ఎయిర్ పోర్టు సిబ్బంది విమానాన్ని నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై లీకయిన ఇంధనాన్ని వెంటనే తొలగించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa