ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని సుకుమా జిల్లా డోర్నపోల్‌లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. కుర్తి వద్ద ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పలు వాహనాలకు నిప్పంటించారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుతో పాటు మరో రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. జగదల్‌పూర్ - హైదరాబాద్ ఆర్టీసీ బస్సును అడ్డుకున్న మావోయిస్టులు ప్రయాణికులను కిందికి దింపి నిప్పు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa