గుజరాత్ లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రంఘోలా వద్ద జరిగిన ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారందరికీ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నా ఆకాంక్ష అంటూ ప్రధాని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పెళ్లి బృందాన్ని తీసుకువెళుతున్న ఓ ట్రక్ ఈ రోజు తెల్లవారుజామున రాజ్ కోట్-భావ్ నగర్ హైవేపై రంఘోలా వద్ద అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోవడంతో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa