హైదరాబాద్: జిమ్నాస్టిక్ ప్రపంచకప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాదీ అథ్లెట్ బీ. అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఖారారైంది. గ్రూప్ సీ క్యాటగిరీలో ఆమెకు రైల్వే ఉద్యోగం ఇస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల క్రితం జిమ్నాస్ట్ అరుణారెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం అందజేవారు . దేశ గౌరవాన్ని పెంపొందించేలా చేసిన తెలంగాణ బిడ్డను అభినందించి ఘనంగా సత్కరించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను అరుణారెడ్డి కలిసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa