ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి : దిగ్విజయ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2017, 10:08 AM

న్యూఢిల్లి:  ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించిన వారిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. గోవా ఎన్నికల్లో పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనే అంశంపై దిగ్విజయ్‌ మాట్లాడుతూ ఢిల్లి ఉదంతాన్ని ప్రస్తావించారు. ఢిల్లిలో బిజెపి పెద్ద పార్టీగా అవతరించినప్పుడు గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపిని ఆహ్వానించారని కానీ బిజెపి తిరస్కరించడంతో గవర్నర్‌ ఆహ్వానం మేరకు ఆప్‌, కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని ఆయన గుర్తు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com