హైదరాబాద్: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ హబ్ (వీ-హబ్)ను నేడు ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించనున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ముగింపు సందర్భంగా మంత్రి కేటీఆర్ రూ.15 కోట్లతో వీ-హబ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలోని టీసాట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వీ-హబ్‌కు రావుల దీప్తిని సీఈవోగా నియమితులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa