హైదరాబాద్: నగరానికి మరోమారు విమానాలపండుగ వచ్చింది. తమలో దాగిన సాంకేతికాంశాలను తెలియజేయడంతో పాటు విమానయాన రంగంలో ఉన్న అపార అవకాశాల గురించి తెలియజేయడానికి లోహవిహంగాలు సిద్ధమయ్యాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2018 శీర్షికన ఈ షోను నిర్వస్తున్నారు. అంతర్జాతీయ ప్రదర్శన, పౌర విమానయాన సదస్సులో 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. వీరితోపాటు 15కు పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, కార్గో ఎయిర్‌క్రా్‌ఫ్టలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రదర్శనలో మొదటి రెండు రోజులూ కేవలం బిజినెస్ విజిటర్లకు కేటాయించగా చివరి రెండు రోజులనూ సామాన్య సందర్శకులను సైతం అనుమతిస్తారు. బిజినెస్ విజిటర్లకు 2వేల రూపాయలను ప్రవేశ రుసుముగా నిర్ణయించగా, సామాన్య సందర్శకులకు 400 రూపాయలు వసూలు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa