ముంబై : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంనుంచి టిడిపి మంత్రులు ఇద్దరు రాజీనామా చేసి వైదొలగడంపై బిజెపికి ఒకనాటి మిత్రపక్షమైన శివసేన స్పందించింది. ఇతర పార్టీలు కూడా ఎన్‌డిఎకు గుడ్‌బై చెబుతాయని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రవుత్ చెప్పారు. ఈ విషయాన్ని శివసేన ఎన్నడో గ్రహించిందని ఆయన అన్నారు. మిత్రపక్షాలను బిజెపి గౌరవించడం లేదని, ఒక్కొక్క మిత్రపక్షమే ఆ పార్టీకి దూరమవుతుందని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa