ప్రధాన మంత్రి జనరిక్ ఔషధ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మార్చి 2017 నాటికి 3వేల కేంద్రాల ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకూ కేవలం 800 సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. లోక్ సభలో కొశ్చన్ అవర్ లో మాట్లాడిన బూర నర్సయ్య అవసరమైతే ఎంపీ లాడ్స్ నిధులతో జనరిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఫార్మా స్టూడెంట్లకు అప్పగించాలని సూచించారు.