హైదరాబాద్: విద్యార్థులపై ఉపాధ్యాయుల ప్రభావం అధికంగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన హెడ్‌మాస్టర్లకు కడియం శ్రీహరి సన్మానం చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచేందుకు హెడ్‌మాస్టర్లు కృషి చేసి, అందరికీ మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతీ పాఠశాలకు నల్లా కనెక్షన్ ఇవ్వాలని ఉత్తర్వులిచ్చామన్నారు. 7 నుంచి 10వ తరగతి వరకు బాలికలకు హెల్త్ కిట్స్ ఇస్తమని కడియం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండటం లేదని, ఉపాధ్యాయులు సామాజిక స్పృహతో పనిచేయాలన్నారు. పాఠశాలల్లో ప్రశాంత వాతావరణ ఉండేలా చూడాలని హెడ్‌మాస్టర్లకు సూచించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa