హైదరాబాద్ : మిలియన్ మార్చ్ ఏర్పాటుకు టీఎస్ జేఏసీ కోరిన అనుమతిని నగర పోలీసులు నిరాకరించారు. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్‌బండ్‌ను మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నుంచి వచ్చిపోయే ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
l సికింద్రాబాద్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే వాహనాలను కార్బల మైదాన్ సమీపం నుంచి షెయిలింగ్ క్లబ్, కవాడిగూడ ఎక్స్‌రోడ్డు, డీబీఆర్ మిల్స్, కట్టమైసమ్మ, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి, రవీంధ్రభారతీ రూట్‌లో
మళ్లిస్తున్నారు.
l నెక్లెస్ రోటరీ, తెలుగుతల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను గంగమహాల్-ఇందిరాపార్కు రూట్‌లో మళ్లిస్తారు.
l నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్ వైపు మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లే వాహనాలను మింట్‌కంపౌండ్ లేదా సచివాలయం మీదుగా ఎన్టీఆర్‌మార్గ్, నెక్లెస్‌రోటరీ, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు,నల్లగుట్ట, సికింద్రాబాద్ రూట్‌లో మళ్లిస్తారు.
l బషీర్‌బాగ్ వైపు నుంచి అప్పర్‌ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లే వాహనాలు మోర్ మెడికల్ హాల్, బాలాజీ గ్యాండ్‌బజార్, క్రిస్టల్ ఐటీ, తెలుగుతల్లి, ఇక్బాల్‌మినార్ మింట్ కంపౌండ్ లేదా రవీంద్రభారతి మీదుగా వెళ్లాలి.
l సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు కర్బాలమైదాన్ నుంచి బుద్దభవన్, సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు, నెక్లెస్ రోటరీ, వీవీ విగ్రహం లేదా
తెలుగుతల్లి వైపు వెళ్లాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa