జీఎస్‌టీ ఎగవేతను నిరోధించేందుకు ప్రవేశపెట్టిన ఈ-వే(ఎలక్ట్రానిక్-వే) బిల్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా రాష్ట్రాల మధ్య జరిగే సరకు రవాణాకు ఈ-వే బిల్లు ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. జూన్ 1 నాటికి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్లు అమల్లోకి వస్తుంది పేర్కొంది. ఈ మేరకు శనివారం జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
శనివారం దిల్లీలో 26వ జీఎస్‌టీ మండలి సమావేశం జరిగింది. కాగా.. జీఎస్‌టీ రిటర్న్‌ల సరళీకరణపై ఈ సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సరళీకరణ ప్రక్రియపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి ఈ అంశాన్ని వాయిదా వేశారు. దీంతో మరో మూడు నెలల పాటు జీఎస్‌టీఆర్ 3బీ ఫైలింగ్‌ను పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa