ఆదిలాబాద్: మంత్రి జోగు రామన్న ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని మవల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు మంత్రి జోగు పోలియో చుక్కలు వేశారు. 0 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ తప్పకుండా పోలీయో చుక్కలు వేయించాలని మంత్రి తల్లిదండ్రులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa