చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా అడవుల్లో మంటలు చెలరేగాయి. బోడి సమీపంలో కురంగణి అడవుల్లో నిన్న మంటలు చెలరేగాయి. పర్వతారోహణకు వెళ్లిన చెన్నైకి చెందిన వ్యక్తుల్లో అడవుల్లో చిక్కుకున్నారు. అడవుల్లో చెలరేగిన మంటల ధాటికి 8 మంది మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే మధురై ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం వైమానిక దళ సిబ్బంది గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa