హైదరాబాద్ : తెలంగాణ శాసనసభను ఈ నెల 27వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. నేడిక్కడ జరిగిన బిఎసి సమావేశం ముగిసింది. బిఎసి సమావేశంలో సభా కార్యక్రమాలను ఖరారు చేశారు. ఈ నెల 13వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడతారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది. 14న ప్రభుత్వం సమాధానమిస్తుంది. ఈ నెల 15వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 17వ తేదీన బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. 19వ తేదీన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానమిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa