బంగ్లాదేశ్‌కు చెందిన విమానం సోమవారంనాడు నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో సోమవారంనాడు కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాశ్రయంలో దిగడానికి కొద్ది ేపు ముందు ఖాట్మండ్ శివారులో ఈ ప్రమాదం సంభవించింది.ప్రయాణికుల్లో 17 మందిని వెలికి తీశారు. గాయపడిన ఆ 17 మందిని ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికుల పరిస్థితి ఏమిటనేది తెలియదు. ఈ విమానం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బయలుదేరింది.ప్రమాదానికి గురైన విమానాన్ని యుఎస్ - బంగ్లా ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. ఈ విషయాన్ని విమానాశ్రయం అధికార ప్రతినిధి బీరేంద్ర ప్రసాద్ శ్రేష్ట చెప్పారు. మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa