హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్ సమీపంలో గల ఎన్టీఆర్ ఘాట్ ఎదుట సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ ఫై ఓవర్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ఎన్టీఆర్ ఘాట్ ముందు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. కారులో ఉన్న వారిని హుటాహుటిన బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు.. కారును ట్రాఫిక్ వాహనంతో వేరేచోటికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa