ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల రోజుల్లోగా అక్ర‌మ హోర్డింగ్‌ల‌న్నింటిని తొల‌గిస్తాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 13, 2018, 04:53 PM

హైద‌రాబాద్: గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో గుర్తించిన అక్ర‌మ హోర్డింగ్‌ల‌న్నింటిని నెల రోజుల్లోగా తొల‌గించ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ ప్ర‌క‌టించింది. హైద‌రాబాద్‌లో గుర్తించిన 333 అక్ర‌మ హోర్డింగ్‌ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 195 హోర్డింగ్‌లు, ఒక యూనిపోల్‌ను తొల‌గించారు. మిగిలిన 138 హోర్డింగ్‌లు, యూనిపోళ్ల‌ను నెల రోజుల్లోగా తొల‌గించ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్‌ క‌మిష‌న‌ర్ అద్వైత‌కుమార్ సింగ్ తెలిపారు. ఖైర‌తాబాద్ ఆర్‌.టి.ఐ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఉన్న అనధికార యూనిపోల్‌ను నేడు తొల‌గించామ‌ని తెలిపారు. జ‌న‌వ‌రి 22న ప్రారంభమైన ఈ అక్ర‌మ హోర్డింగ్‌లను తొల‌గించ‌డానికి టెండ‌ర్ ద్వారా మేస‌ర్స్ ఇస్టా యాడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్ప‌గించామ‌ని, 2017 ఏప్రిల్ 19వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన స‌ర్వేలో 333 అక్ర‌మ హోర్డింగ్‌లు ఉన్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం తొల‌గిస్తున్న హోర్డింగ్ ప్ర‌క్రియ సంద‌ర్భంగా కూడా కొత్త‌గా అన‌ధికార హోర్డింగ్‌ల‌ను గుర్తించి వాటిని కూడా తొల‌గించ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. ఈ అక్ర‌మ హోర్డింగ్‌ల తొల‌గింపున‌కు ప్ర‌తి జోన్‌కు ప్ర‌త్యేకంగా ఇంజ‌నీర్ల‌ను నియ‌మించామ‌ని తెలిపారు. మిగిలిన 138 హోర్డింగ్‌ల‌ను తొల‌గించే ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తొల‌గించిన 195హోర్డింగ్‌ల‌లో 84హోర్డింగ్‌లు జీహెచ్ఎంసీ నియ‌మించిన‌ ఏజెన్సీ తొల‌గించగా మిగిలిన 111 సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు స్వ‌యంగా తొల‌గించుకున్నాయ‌ని అన్నారు. తొల‌గించిన‌వాటిలో అత్య‌ధికంగా ఈస్ట్ జోన్‌లో 69, సెంట్ర‌ల్ జోన్‌లో 39, వెస్ట్, నార్త్ జోన్‌ల‌లో 37 చొప్పున, సౌత్ జోన్‌లో 23 అక్ర‌మ హోర్డింగ్‌ల‌ను తొల‌గించామ‌ని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com