నేడు హైకోర్టులో పిటిషన్‌ వేయనున్న టి.కాంగ్రెస్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 09:11 AM
 

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వాలను అసెంబ్లీ స్పీకర్ రద్దు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు హైకోర్టులో పిటిషన్ వేయనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడమేగాక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్స్ విసరడంతో అవి మండలి చైర్మన్ చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలి కన్నుకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాలను స్పీకర్‌తో రద్దు చేయించింది. అయితే... ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేయాలని టి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.