కోహ్లిని పెళ్లి చేసుకోమంటే..

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 10:06 AM
 

లండన్‌: కొన్ని నెలల కిందటే ఆస్ట్రేలియాపై 56 బంతుల్లో సెంచరీ కొట్టి సంచలనం రేపింది ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డాని వ్యాట్‌. ఆమె సెంచరీ బాదిన బ్యాట్‌ టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. ప్రస్తుతం తాను వినియోగిస్తున్నది ఆ బ్యాటే అని వ్యాట్‌ వెల్లడించింది. ‘‘టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి దక్షిణాఫ్రికాపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ చూసి వెంటనే ట్విటర్లో ‘కోహ్లీ.. నన్ను పెళ్లాడు’ అని సందేశం పెట్టాను. పది నిమిషాలకే వెయ్యి రీట్వీట్లు వచ్చాయి. అది భారత్‌లో పెద్ద వార్త అయింది. ఆ తర్వాత 2014లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వచ్చినపుడు విరాట్‌ను కలిశా. ట్విటర్లో అలాంటి సందేశాలు పెట్టొద్దని.. కొందరు వాటిని నిజమనుకుంటారని కోహ్లి హెచ్చరించాడు. నేను సారీ చెప్పా. అప్పుడే అతను నాకు బ్యాట్‌ బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం నేను ఆ బ్యాటే వాడుతున్నా. దాంతోనే సెంచరీ కొట్టా’’ అని వ్యాట్‌ తెలిపింది.