మండలి ఛైర్మన్‌పై హెడ్‌ఫోన్స్‌ విసిరింది నలుగురు

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 10:13 AM
 

హైదరాబాద్‌: ఈ నెల 12న శాసనసభలో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్స్‌ విసిరింది నలుగురు సభ్యులు అని వెల్లడైంది. వీడియో ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం అసెంబ్లి కార్యాలయం నలుగురు సభ్యులు ఉన్నట్లు తేల్చింది. నిన్న ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యుల సభ్యత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ఇద్దరిపైనా బహిష్కరణ వేటు పడే అవకాశం ఉంది. దీనిపై ఇవాళ సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.