కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 10:38 AM
 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. విప్ నల్లాల ఓదెలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు సింగరేణిని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 6 కొత్త భూగర్భ గనుల ఏర్పాటుపై సింగరేణి కార్మికులు ఆనందంగా ఉన్నరని తెలిపారు. సింగరేణి కార్మికులు సీఎం కేసీఆర్‌ను ఆరాధ్య దైవంగా భావిస్తున్నరని వెల్లడించారు. కాగా సింగరేణిలో మరిన్ని భూగర్భ గనులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై మంత్రి జగదీష్‌రెడ్డి స్పందిస్తూ.. సింగరేణిలో కొత్తగా ఆరు భూగర్భ బొగ్గు గనులను ప్రారంభించినట్లు తెలిపారు. కొత్త భూగర్భ గనుల ద్వారా 4 వేల మందికి పైగా ఉపాధి లభించనున్నట్లు చెప్పారు. భూ నిర్వాసితులకు జిల్లా కలెక్టర్ల ద్వారా పరిహారం అందిస్తామన్నారు. నిర్వాసితులకు చట్ట ప్రకారం అన్ని ప్రయోజనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.