గజ్వేల్‌లో పోటీ చేస్తా.. గెలిచి చూపిస్తా: కోమటిరెడ్డి

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 10:50 AM
 

హైదరాబాద్: పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో పోటీచేసి గెలిచి చూపిస్తానని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన  ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... నాకు పదవులు గడ్డి పోచతో సమానం అన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్‌పై రాష్ట్రపతిని కలుస్తామన్నారు. అలాగే కాంగ్రెస్‌ పెద్దలను కలిసి పరిస్థితిని వివరిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అలాగే కోమటిరెడ్డితోపాటు శాసనసభ్యత్వం కోల్పోయిన మరో కాంగ్రెస్ నేత సంపత్ మాట్లాడుతూ... తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్‌పై హైకోర్టుకు వెళ్తామన్నారు. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని సంపత్ అన్నారు.