సస్పెన్షన్లపై నేడు హైకోర్టులో పిటిషన్‌ వేయనున్న టీ కాంగ్రెస్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 11:05 AM
 

సభ్యత్వ రద్దు, సస్పెన్షన్లకు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఇవాళ హైకోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌ దాఖలు చేయనుంది. టీ కాంగ్రెస్‌ దీక్ష తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లే యోచనలో టీ కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వం రద్దుతో పాటు 11 మంది కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ కు గురైన విషయం తెలిసిందే. శాసన మండలిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సస్పెండ్ అయిన విషయం విధితమే. దీంతో సభ్యత్వ రద్దు, సస్పెన్షన్లకు వ్యతిరేకంగా  తెలంగాణ కాంగ్రెస్‌ న్యాయ పోరాటానికి  సిద్ధమైంది.