పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వ ఆర్థిక సాయం: జోగు రామన్న

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 11:13 AM
 

హైదరాబాద్‌: పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి జోగు రామన్న అన్నారు. అసెంబ్లిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. వివాహం జరిగిన రోజే చెక్కులు ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు. గ్రామాల్లో రూ.1.5 లక్షలు ఆదాయం, పట్టణాల్లో రూ.2లక్షలు ఆదాయం ఉన్న పేదలకు వర్తింపజేస్తున్నామన్నారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి జోగురామన్న అన్నారు. అసెంబ్లిdలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. పెళ్లిళ్ల కోసం ఇప్పటి వరకు 3.10 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. పెళ్లిళ్ల కోసం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 2.90 లక్షలు పూర్తి చేశామన్నారు.