ఈ బడ్జెట్‌లో కొత్తగా పెట్టుబడి పథకం: మంత్రి ఈటల

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 11:22 AM
 

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారని, పథకాలన్నీ సమర్థంగా అమలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఈటల వరుసగా ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో కొత్తగా పెట్టుబడి పథకం తీసుకొస్తున్నామని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని మంత్రి ఈటల చెప్పుకొచ్చారు. ఈనెల 15న అసెంబ్లీలో ఐదో వార్షిక బడ్జెట్‌ను మంత్రి ఈటల ప్రవేశపెట్టనున్నారు.