స్టీఫెన్‌ హాకింగ్‌ మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 11:35 AM
 

హైదరాబాద్‌ : ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. స్టీఫెన్‌ హాకింగ్‌కు శరీరం సహకరించకపోయినా మేథోశక్తితో అద్భుత ఆవిష్కరణలు చేశారని సిఎం కొనియాడారు. స్టీఫెన్‌ హాకింగ్‌ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారని కెసిఆర్‌ పేర్కొన్నారు.