కేన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు చర్యలు: లక్ష్మారెడ్డి

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 01:01 PM
 

హైదరాబాద్‌: కేన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ అన్ని పాత జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.


Telangana E-Paper