ట్యాంక్‌బండ్‌పై ధర్నాలు నిషేధించాం : సీఎం కేసీఆర్

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 02:19 PM
 

హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై ధర్నాలు, నిరసనలు నిషేధించామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నిరసనకారుల పట్ల కఠినంగానే ఉంటాం. నిషేధాజ్ఞలు మేము తీసుకురాలేదు. చంద్రబాబు హయాంలో నిషేధాజ్ఞలు తీసుకువచ్చారు. అనుమతి లేకున్నా, కోర్టు వద్దన్నా ధర్నాలు చేస్తామంటే తాము అనుమతించాం. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలుపాలి. బస్సు యాత్రలు, పాదయాత్రలు ఆపామా? అని ప్రశ్నించారు. బస్సు యాత్రలు చేసి తుస్సుమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యబద్దంగా ఉందని ఉద్ఘాటించారు. పరిమితికి లోబడి నిరసన తెలిపితే ఎవరైనా స్వీకరిస్తారు. అనుమతి లేకున్నా ధర్నాలు, నిరసనలు చేస్తామనడం సరికాదు. ధర్నాలు నిర్వహించుకునేందుకు సరూర్‌నగర్‌లో అవకాశం ఇచ్చాం. అక్కడ ధర్నా చేస్తే ఏమౌతుందని ప్రశ్నించారు. మంచి పద్ధతిలో ధర్నాలు, ర్యాలీలు చేయాలని సూచించారు. లేని వాటిని ఊహించుకుని తాము ప్రజాస్వామ్యబద్ధంగా లేమని ప్రచారం చేయడం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు.