హెచ్‌డీఎఫ్‌సీ నుంచి క్రిప్టో సేవ‌ల బంద్

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 02:29 PM
 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు వాడుతున్నారా? అయితే ఇకపై మీ బ్యాంక్‌ కార్డుల ద్వారా క్రిప్టోకరెన్సీ సంబంధిత లావాదేవీలు నిర్వహించడం కుద‌ర‌దు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాజాగా తన క్రెడిట్‌, డెబిట్‌, ప్రిపెయిడ్‌ కార్డులపై క్రిప్టోకరెన్సీల కొనుగోలు, ట్రేడింగ్‌ సర్వీసులను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. క్రిప్టోకరెన్సీలపై అంతర్జాతీయంగా భయాలు పెరుగుతోన్న నేపథ్యంలో బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా క్రిప్టోకరెన్సీపై హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా భారత్‌లో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత లేదు.


బ‌డ్జెట్ ప్ర‌సంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్రిప్టో క‌రెన్సీల గురించి మాట్లాడుతూ క్రిప్టో క‌రెన్సీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేద‌ని చెప్పారు. అంతే కాకుండా వ్య‌వ‌స్థ‌లో వాటి వినియోగాన్ని త‌గ్గించే చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని స‌భాముఖంగా వివ‌రించారు.