సెమి-ఫైనల్ కు మేం సిద్ధం

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 03:26 PM
 

తన శాసన సభ్యత్వాన్ని నేరుగా రద్దు చేసే అధికారం స్పీకర్ కు లేదన్నారు నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవలసింది గవర్నరేనని, ఒకవేళ ఆయన కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నికకు సిద్ధమేనని వెంకట రెడ్డి చెప్పారు.సభ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, తనతో బాటు సంపత్ కుమార్ సభ్యత్వాల రద్దుకు నిరసనగా గాంధీ భవన్ లో జరుగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలపై తెరాస హడావుడి చేస్తోందని, వాళ్ళ కిదే మా సవాల్ అన్నారు. సెమీ-ఫైనల్ కు మేం సిద్ధం.. 2019 లో జరిగే ఫైనల్స్ లో మా పార్టీ వంద సీట్లు గెలుచుకోవడం ఖాయం అని వెంకట రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.