ఉద్యోగాల భర్తీ విషయంలోను ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించలేదు: లక్ష్మణ్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 03:51 PM
 

హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీ విషయంలోను ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించలేదని బీజేపీ సభ్యులు లక్ష్మణ్‌ అన్నారు. అసెంబ్లిలో ఆయన మాట్లాడుతూ… 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని గురించి పేర్కొనలేదన్నారు. 11వ పీఆర్‌సీ వేయాలని ఉద్యోగులు కోరుతున్నారని, ప్రభుత్వం త్వరగా స్పందించాలన్నారు. సీపీఎస్‌ విధానంపై కూడా ఉద్యోగులు పోరాడుతున్నారని, ఆ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. సీపీఎస్‌ అంశం కేంద్ర ప్రభుత్వం చేసినదైనప్పటికీ, కొన్ని రాష్ట్రాలు సొంత విధానం పాటిస్తున్నాయన్నారు. మన రాష్ట్రం కూడా కొన్ని మార్పులు చేసి ఉద్యోగుల డిమాండ్లకు అనుగుణంగా అమలు చేయాలన్నారు.