శాసనసభ రేపటికి వాయిదా

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 03:57 PM
 

హైదరాబాద్ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల సభ్యులు లేవనెత్తిన సందేహాలను సీఎం కేసీఆర్ నివృత్తి చేశారు. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది.