ఉత్తరప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో రెండు సిట్టింగ్ స్థానాల్లోనూ ఆ పార్టీ ఓటమి పాలైంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం, బీజేపీ కంచుకోటగా పేరున్న గోరఖ్‌పూర్ స్థానంలో ఎస్పీ-బీఎస్పీ కూటమి ఘన విజయం సాధించింది. ఇక డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామాతో ఖాళీ అయిన పూల్‌పూర్ నియోజకవర్గంలోనూ బీజేపీకి పరాభవం తప్పలేదు. దీంతో బీజేపీపై ఇప్పటికే విపక్షాలు విమర్శనాస్త్రాలు సందిస్తున్నాయి. అయితే బీజేపీ పరాజయంపై తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఏదీ శాశ్వతం కాదని మరోసారి తేలిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘ఉత్తరప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం ఖాళీచేసిన లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీని ఢిల్లీలో హాట్ సీట్లో కూర్చోబెట్టిన రాష్ట్రం ఇప్పుడు ఏదీ శాశ్వతం కాదని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. మరో జాతీయ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఇదే పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుంది’ అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్ని్కల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని అర్థమవుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఫలితాలు ఊతమిచ్చేలా ఉన్నాయి. బీజేపీకి ప్రజా వ్యతిరేకత పెరిగిందని ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ 21,961 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పూల్‌పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ 59,460 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి కౌశలేంద్రసింగ్ పటేల్‌ను ఓడించారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా ఎదురుగాలి వీస్తుందనే చెప్పాలి.
Interesting to see the election results of the Loksabha seats vacated by UP CM & his Deputy CM. The state that catapulted BJP into the hot seat in Delhi has sent a clear message that nothing is permanent
The other Notional party has lost its deposits & relevance yet again
— KTR (@KTRTRS) March 15, 2018
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa