మేజర్‌న్యూస్, తెలంగాణ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజ లంతా కలసి ఉండి అభివృద్ది పనులను సాదించుకోవాలని అన్నారు. హన్మ కొండలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెట్టు బొట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి నుండి టిఆర్‌ఎస్‌కు అండగా ఉంటున్న వరంగల్ పశ్చిమ నియోజక వర్గాన్ని అన్ని విదాలుగా అభివృద్ది చేస్తామని హమీ ఇచ్చారు. యువ నాయ కుడిగా దాస్యం వినయ్ భాస్కర్ ఉత్సాహంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అడవిని నరికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల సమస్యలపై స్పందించారు. అటవీ ప్రాంతాలలో అధికారలు సర్వే నిర్వహిస్తారని ఇందులో పది ఎకరాల లోపు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములను తీసుకో మన్నారు. అంతకంటే ఎక్కువ ఉన్న వారిని మాత్రం వదలబోమని హెచ్చరిం చారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ ఏడాది హరిత హరంలో అనుకున్న లక్ష్యాలను సాదిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడెక్కడ మొక్కలు నాటాలనే అంశంపై ఓ స్పష్టతకు వచ్చామన్నారు. ఇందుకు కావాల్సిన మొక్కలను అందుబాటులో ఉంచామని వివరించారు. జిల్లా కలెక్టర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం రెండేళ్లలో అనేక విజయాలు సాదించిందని మంత్రి గుర్తు చేశారు. బిసిలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్‌కుమార్, కార్పో రేటర్ దాస్యం విజయ్‌భాస్కర్, వీరగంటి రవీందర్ వరంగల్ పశ్చిమ నియోజక వర్గ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.