లక్నో: లక్నోలో దారుణ ఘటన వెలుగుచూసింది. వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి లిఫ్ట్ ఫేరుతో మహిళలను వాహనంలో ఎక్కించుకున్నాడు. ఆ వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కదులుతున్న వాహనంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళలు ఫరూఖాబాద్ నుంచి కమల్‌గంజ్‌కు తిరిగొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళలకు తెలిసిన వ్యక్తే వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారం జరిగిన తర్వాత మహిళలు ఓ దాబాకు వచ్చి తలదాచుకున్నారని కన్నౌజ్ ఎస్సీ శేఖర్ చంద్ర గోస్వామి తెలిపారు. దాబా యజమాని మహిళలను స్టేషన్‌కు తీసుకువచ్చి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బాధిత మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి, వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపడతామన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa