ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో ఛండాలం పని చేస్తూ..భర్తకు వీడియోలు..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 10:45 AM

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ...పవిత్రమైన వివాహబంధంతో ఇరు కుటుంబాల పెద్దలు భార్యాభర్తల కలుపుతారు.  జీవితాంతం ఒకరికొరు..స్నేహబంధంతో..అనురాగ బంధంతో కలకాలం పిల్లా పాపలతో జీవించాలని నిండు మనసుతో దీవిస్తారు.  అయితే ఈ మద్య వివాహ బంధాలకు మచ్చ తెస్తున్నారు..కొంత మంది మహిళలు.


గతం లో భర్తల వేదింపులు తట్టుకోలేక భార్యలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని విన్నాం..కానీ ఈ మద్య కాలంలో భార్యలు చేసే పడు పనులకు భర్తలు ఆత్మ హత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెళ్లి చేసుకున్నాక భర్త ,పిల్లలతో హ్యాపీ గా గడపాల్సిన భార్యలు , వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ భర్తలను చంపుతున్నారు.  గత నెలలో వరుసగా ఇలాంటి విషాదాలు చోటు చేసుకున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే..ఆ మద్య ఓ వివాహిత..ఏకంగా తన భర్త స్థానంలో వేరే వ్యక్తిని తీసుకు వచ్చి..తన భర్తలా రూపు రేఖలు మార్చకునే ప్రయత్నం కూడా చేసింది.కానీ పాపం పండి వారి అక్రమసంబంధం గుట్టు బయట పడింది.  తాజాగా ఓ వివాహిత చేసిన పనికి భర్త మానసికంగా కుంగిపోయి..ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. దండేపల్లి  మండలం ధర్మారావు పేట కు చెందిన ధర్మరాజు (27) అనే యువకుడితో జగిత్యాల మండలం కానాపూర్ గ్రామానికి చెందిన నాగ లక్ష్మి తో గత ఏడాది మార్చిలో వివాహం జరిగింది. 


కొన్ని రోజులు భార్యా భర్తలు కలిసి బాగానే కాపురం చేశారు. అయితే నాగ లక్ష్మి, జగిత్యాల జిల్లా వెల్గటూర్ కు చెందిన మహేష్ తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం సాగిస్తుంది.  మహేష్ తనతో నాగలక్ష్మి గడిపి అసభ్యకరమైన వీడియోలను ధర్మరాజుకు పంపేవాడు..వీరి పాపం ఎంతగా ఉందంటే..అక్రమ సంబంధం కొనసాగించే సమయంలో భర్త కట్టిన తాళిని పక్కన పెట్టి మహేష్ తో తాళి కట్టించుకొని వ్యవహారం నడిపించే వారు.


ఆ వీడియోలు చూసిన ధర్మరాజు భార్య చేసే దుర్మార్గాన్ని తట్టుకోలేక పోయాడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ విషయం బయట పడటంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని నాగ లక్ష్మి తో పాటు మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa